బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై తీర తీర ప్రాంతంలోని క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు దాడులు చేసి ఆర్యన్ ఖాన్ (Aryan Khan) తోపాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొకైన్, మెఫెడ్రోన్ తోపాటు పలు మత్తు పదార్థాలను సీజ్ చేశారు.
అయితే ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసినట్టు వార్తలు రావడంతో నెటిజన్లు షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో షారుక్ కభీ హా కభీ నా కోస్టార్ సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) షారుక్ ఖాన్ కు మద్దతుగా నిలుస్తూ ట్రోల్స్ కు చెక్ పెట్టింది. తల్లిదండ్రులకు కష్టాల్లో ఉన్న తమ బిడ్డను చూడటం కంటే పెద్ద కష్టం మరొకటి లేదు. బాలీవుడ్ ను లక్ష్యంగా చేస్తున్న వారందరికీ జరిగిన ఎస్సీబీ దాడులన్నీ గుర్తున్నాయా..? ఏ కేసు నిరూపించబడలేదు..అంటూ ట్వీట్ చేసింది.
Nothing harder for a parent than seeing their child in distress. Prayers to all 🙏
— Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021
శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీ( Rave party )కి సంబంధించి ఎన్సీబీ అధికారులు ఆర్యన్ను ఉదయం నుంచి ప్రశ్నించి సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలను కూడా అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఇప్పటికే తెలిపారు.
For all those targetting #Bollywood remember all the #NCB raids on filmstars? Yes nothing was found and nothing was proved. #Bollywood gawking is a tamasha. Its the price of fame
— Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి