Su From So | చిన్న సినిమాగా విడుదలై కన్నడలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమా తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ని ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ, విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజ్ బి శెట్టి సహ-నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని జెపి తుమినాడ్ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం, వినూత్నమైన కథాంశంతో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం కన్నడలో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.28 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అంతేగాకుండా కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 3.80 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడై, ఒకే రోజులో ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది.
The highly acclaimed & successful film #SuFromSo is coming to entertain the Telugu audience ❤🔥
Grand release across the Telugu States soon by @MythriRelease ✨@RajbShettyOMK @lighterbuddha @jpthuminad @ShaneelGautham pic.twitter.com/Pk3JCwjjyu
— Mythri Movie Distributors LLP (@MythriRelease) August 2, 2025