కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం బీస్ట్ (Beast) . యాక్షన్ థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం విజయ్-పూజాహెగ్డే (Pooja Hegde)పై స్టైలిష్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారట డైరెక్టర్ అండ్ టీం. చెన్నైలోని గోకులం స్టూడియోస్ లో ఈ పాట షూటింగ్ కొనసాగుతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా పాపులర్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నాడు.
ఈ పాటను చాలా కలర్ ఫుల్గా భారీ స్థాయిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా కంపోజ్ చేస్తున్నాడట జానీ. ప్రొడక్షన్ డిజైన్ డిపార్టుమెంట్ ఈ పాట కోసం భారీ, కలర్ ఫుల్ సెట్టు వేశారు. స్టైలిష్ విజువల్స్ తో సాగే ఈ పాటలో విజయ్ డ్యాన్స్ అభిమానులను థ్రిల్లింగ్ కు గురిచేయడం పక్కా అంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాతో పూజాహెగ్డే సుమారు 9 ఏండ్ల విరామం తర్వాత కోలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బీస్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పూజాహెగ్డే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి నటించిన రాధేశ్యామ్ సంక్రాంతికి విడుదల కానుంది. అఖిల్ అక్కినేని-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అక్టోబర్ 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఆచార్యలో కూడా కీ రోల్ చేస్తుండగా..హిందీలో ఓ సినిమా చేస్తోంది.
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్