Kriti Sanon | బాలీవుడ్ తార కృతి సనన్‌కు గ్లామర్ హీరోయిన్గా పేరుంది. ఎలాంటి అండ, ఎవరి వారసత్వం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కృతి..వరుస విజయాలతో అగ్ర తారగా ఎదిగింది. ప్రస్తుతం ఆమెకు చేతిలో తీరిక లేనన్ని సినిమాలు ఉన్నాయి. ఇటీవలే షెహజాదా సినిమా షూటింగ్ విదేశాల్లో పూర్తి చేసుకుని వచ్చిన కృతి..వెంటనే గణపథ్ సినిమా చిత్రీకరణకు రెడీ అవుతున్నది. షెహజాదా సినిమా అల వైకుంఠపురములో చిత్ర రీమేక్ గా తెరకెక్కుతున్నది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు.
టైగర్ ష్రాఫ్‌తో కలిసి కృతి సనన్ నటిస్తున్న గణపథ్ సినిమా టీమ్ రెగ్యులర్ చిత్రీకరణ కోసం లఢక్ వెళ్తున్నారు. మండే ఎండల్లో లఢక్ చల్లని వాతావరణంలో షూటింగ్ చేయబోతున్నారు. టైగర్ ష్రాఫ్‌కు యాక్షన్ హీరోగా పేరుంది. అయితే ఈ సినిమాలో టైగర్‌తో పాటు కృతి సనన్ కూడా అదిరిపోయే స్టంట్స్ చేయనుంది. ఈ సినిమా కోసం షావోలిన్ పోరాట విద్యలను నేర్చుకుంటున్నది కృతి. ఆమెకు ఈ స్టంట్స్ నేర్పిస్తున్న హర్ష్ వర్మ కృతి టాలెంట్ గురించి మాట్లాడుతూ…కృతి చెప్పేది బాగా వింటుంది. త్వరగా నేర్చుకుంటుంది. షావోలిన్ ఫైట్స్ నేర్చుకోవడం సహజంగా కష్టం. కానీ కృతి త్వరగా పర్ఫెక్ట్గా నేర్చుకుంది. గణపథ్ రిలీజ్ అయ్యాక ఆమెను యాక్షన్ క్వీన్ అని పిలుస్తారు. అని చెప్పాడు.
కృతి చేతిలో ప్రస్తుతం ఆది పురుష్, హారర్ డ్రామా బేడియా చిత్రాలతో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో ఓ సినిమా ఉన్నాయి.