Stunt Master | తమిళ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి స్టంట్స్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న రాజు, రీసెంట్గా జరిగిన షెడ్యూల్ లో కార్ స్టంట్ చేస్తుండగా, ఊహించని ప్రమాదంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు ప్రముఖులు రాజుకు సంతాపం తెలియజేస్తున్నారు. హీరో విశాల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంతో స్పందించారు.ఈ ఘటన గురించి విన్న వెంటనే షాక్‌కు గురయ్యాను. స్టంట్ మాస్టర్ రాజు ఇకలేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను.
చాలా ధైర్యంగా, రిస్క్ తీసుకుని పని చేసే వ్యక్తి రాజు. నా పలు సినిమాల్లో స్టంట్ మాస్టర్‌గా పని చేశాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో రాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వారి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తానని హామీ ఇస్తున్నాను అని విశ్వాల్ ట్వీట్ చేశారు.ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రాజు మృతి పట్ల సంతాపం తెలియజేశారు. కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్టుల్లో ఒకరైన ఎస్ ఎం రాజు స్టంట్స్ చేస్తూ మరణించడం దారుణం. మా స్టంట్ యూనియన్, భారతీయ చిత్ర పరిశ్రమ గొప్ప స్టంట్ మ్యాన్ ను కోల్పోయింది అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పటివరకు ఈ సంఘటనకు సంబంధించి నటుడు ఆర్య కాని లేదంటే దర్శకుడు పా రంజిత్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాలో స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిపై కనీసం సానుభూతి ప్రకటించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. రాజు తమిళ పరిశ్రమలో అనేక సినిమాలకు స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆయన ధైర్యంగా రిస్క్ తీసుకునే నైపుణ్యం, డెడికేషన్‌కు మంచి పేరుంది. విశాల్‌తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన చేసిన స్టంట్లు ప్రేక్షకుల మెప్పు పొందాయి.
Stunt driver ‘Mohan Raj’ passed away during a risky stunt with a car for the movie #Vettuvam starring Arya and directed by Pa.Ranjith. 😑 pic.twitter.com/63y3OEtE0x
— Cinema Madness 24*7 (@CinemaMadness24) July 14, 2025