Shraddha Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌పై నిర్మాత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీ-2 మూవీలో శ్రద్ధ నటించిన విషయం విధితమే. ఈ మూవీలో శ్రద్ధను తీసుకోవడానికి గల కారణాలపై దర్శకుడు అమర్ కిశోర్ వెల్లడించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘స్త్రీ’ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా ? అని ఆలోచిస్తుంటే.. నిర్మాత దినేశ్ విజయ్ కల్పించుకొని శ్రద్ధా కపూర్ పేరుని సూచించాడని తెలిపాడు. అయితే, ఈ సినిమాలో శ్రద్ధను తీసుకోవడానికి ఆమె నవ్వే కారణమని.. ఆమె దెయ్యంలా, మంత్రగత్తెలా నవ్వుతుందని దినేశ్ విజయ్ తనతో అన్నట్లుగా పేర్కొన్నారు. శ్రద్ధాకపూర్, దినేశ్ ఒకే విమానంలో ప్రయాణించారని.. ఆ సమయంలో జరిగిన సంభాషణ సందర్భంగా శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్విందని దినేశ్ పేర్కొన్నారని.. దాంతోనే ఆ పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని చెప్పారని అమర్ కౌశిక్ చెప్పాడు.
దినేశ్ విజయ్ వ్యాఖ్యలపై శ్రద్ధా కపూర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. భారీ విజయం సాధించిన సినిమా హీరోయిన్ను విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.వందలకోట్లకుపైగా వసూలు చేసిన తర్వాత కూడా ‘దెయ్యం’ అని పిలుస్తున్నారా? ‘అది గౌరవంగా ఉందా’ అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. సినిమాను విజయవంతం కావడంలో ఎంతో సహకారం అందించిందని.. దాన్ని దర్శకుడు ఎలా తగ్గించగలడని ప్రశ్నించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన స్త్రీ-2 హర్రర్ కామెడీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రగా నిలిచింది. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్, పంకజ్ త్రిపాఠీ నటించిన ఈ చిత్రం రూ.880కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. ఈ వ్యవహారంపై అమర్ కౌశిక్, నిర్మాత దినేశ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.