Stranger Things Grand Finale | ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన నెట్‌ఫ్లిక్స్ మెగా హిట్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ చివరి సీజన్ (సీజన్ 5) ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు 3 ఏండ్ల తర్వాత ఈ సిరీస్ నుంచి ఫైనల్ సీజన్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘స్ట్రేంజర్ థింగ్స్ – సీజన్ 5’ పేరుతో విడుదలైన ఈ చివరి సీజన్‌ని నెట్‌ఫ్లిక్స్ మూడు భాగాలుగా ప్రేక్షకులకు అందించనుంది. నవంబర్ 27 నుంచి వాల్యూమ్ 1 (మొదటి 4 ఎపిసోడ్స్) స్ట్రీమింగ్ అవుతుండగా, వాల్యూమ్ 2 (తరువాత 3 ఎపిసోడ్స్) క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 26, 2025న విడుదల కానుంది. ఇక ఈ సిరీస్‌కు గ్రాండ్ ఫినాలే అయిన చివరి ఎపిసోడ్ (8వది) న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెలుగు, హిందీ, తమిళం సహా 25కు పైగా భాషల్లో డబ్బింగ్ అయి అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కోసం భారతీయ అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చివరి సీజన్లో హాకిన్స్ పట్టణంలోని చిన్నారుల బృందం గత సీజన్లో వెక్నా సృష్టించిన భయానక వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతారు. ఇక సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అలాగే బలమైన ఎమోషన్స్‌తో నిండిన ఈ ఫైనల్ సీజన్ అద్భుతంగా ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.