షూటింగ్‌కు హాజరు
స్టార్ హీరోయిన్ నయనతార షూటింగ్‌లకు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్' చిత్ర సెట్స్‌లో తాజాగా అడుగుపెట్టింది.
స్టార్ హీరోయిన్ నయనతార షూటింగ్‌లకు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ చిత్ర సెట్స్‌లో తాజాగా అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణకు నయనతార హాజరైన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతార థాయ్‌లాండ్‌కు హానీమూన్ వెళ్లింది. హనీమూన్ ముగించుకుని ‘జవాన్’ సెట్లో అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

