కత్రినాకైఫ్…టాలీవుడ్ ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయే ‘మల్లీశ్వరి’ పాత్రలో కనిపించి…అందరినీ మెప్పించింది. ఈ ఒక్క సినిమా తెలుగులో కత్రినాకైఫ్ కు పది సినిమాలకు సరిపడా గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టిందీ భామ. కత్రినాకైఫ్ సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్ సహా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఈ స్టార్ హీరోయిన్ ఓ స్టార్ హీరోకు రాఖీ కట్టాలని ప్రయత్నించిందట. అయితే ఆ స్టార్ హీరో మాత్రం రాఖీ కడతానంటే వద్దన్నాడట. మరి కత్రినా కైఫ్ లాంటి బ్యూటీ రాఖీ కడతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా..? అనే డౌటు సహజంగానే వస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు అక్షయ్ కుమార్. అసలేం జరిగిందో తెలుసా..?
అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్ కలిసి వెల్కమ్, నమస్తే లండన్, సింగ్ ఈజ్ కింగ్, తీస్ మార్ ఖార్ చిత్రాల్లో నటించారు. కాఫీ విత్ కరణ్ షోలో కత్రినాకైఫ్ దీని గురించి మాట్లాడుతూ..షీలా కీ జవానీ పాట షూటింగ్లో తాను అక్షయ్‌కుమార్ కు రాఖీ కట్టాలనుకున్నా. కానీ అతడు తిరస్కరించాడని చెప్పింది. ఆ తర్వాత అర్జున్ కపూర్ తన రాఖీ బ్రదర్ గా ఉండాలనుకున్నట్టు పేర్కొంది. తీస్ మార్ ఖాన్ సెట్లో ఉన్నపుడు..నేను రాఖీ కట్టాలని ఎవరూ ఎందుకు కోరుకోలేదు. సెట్లో ఎవరూ నాపై దృష్టిపెట్టడం లేదు. ఓ వ్యక్తి డోర్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. అతడు నేను చాలా గౌరవించే, నా ప్రియమైన స్నేహితుడిగా భావించే వ్యక్తి. అందుకే నీకు కడతా అని అతన్ని (అక్షయ్‌కుమార్)ను అడిగాను. నా ఆలోచనలో ఎలాంటి తప్పులేదని భావించాను. అయితే దీనికి అక్షయ్‌కుమార్ స్పందిస్తూ..మీకు చెంపదెబ్బ కావాలా..? అని అడిగాడు.
ఆ తర్వాత నేను కొంచెం నిరాశకు గురయ్యాను. అప్పుడు నేను ఆ టైంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నా. అక్కడ నా ఎదురుగా అర్జున్‌కపూర్ నిలబడి ఉండటం చూశాను. అతడు చాలా ఫిట్ గా ఉన్నాడు. అర్జున్ మీరు నా రాఖీ సోదరుడు అవుతారని ప్రేమతో అన్నాను. అయితే నిజానికి నేను అర్జున్‌కు రాఖీ కట్టలేదు, నేను పరుగెత్తాలని చెప్పగానే అతడు పారిపోయాడు. మరుసటి రోజు కూడా అతన్ని ఛేజ్ చేసేందుకు ప్రయత్నించినా అర్జున్ మళ్లీ పారిపోయాడంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అలా రాఖీ కడతామనుకుంటే ఎవరూ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com