చెక్ బౌన్స్ కేసులో ‘ది వారియర్’ డైరెక్టర్ ఎన్ లింగుసామి (N Lingusamy), అతని సోదరుడు ఎన్ సుభాష్ చంద్రబోస్‌లకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. పీవీపీ క్యాపిటల్ ( PVP Capital) నుంచి కొన్నేళ్ల క్రితం తీసుకున్న కోటి రూపాయలను లింగుస్వామి, సుభాష్‌చంద్ర బోస్ తిరిగి చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఇద్దరు సోదరులపై కేసు నమోదు చేసింది. అయితే లింగుస్వామి సదరు ప్రొడక్షన్ హౌస్ అందజేసిన చెక్ బౌన్స్ అయిందట.
దీంతో లింగుస్వామి, సోదరుడితో కలిసి కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం. మమ్ముట్టి నటించిన ఆనందం సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు లింగుస్వామి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో మంచి స్టార్ డమ్ సంపాదించారు.
లింగుస్వామి-సుభాష్ పేరు మీద తిరుపతి బ్రదర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. మరి చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.