గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 29, 2020 , 22:32:48

స్టాలిన్‌ అందరివాడు

స్టాలిన్‌ అందరివాడు

జీవా, రియాసుమన్‌, గాయత్రికృష్ణ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘స్టాలిన్‌'. ‘అందరివాడు’ ఉపశీర్షిక. డాక్టర్‌ ఇషారి.కె.గణేష్‌, నట్టి కరుణ, నట్టి క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రతిన శివ దర్శకుడు. ఫిబ్రవరి 7న విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘అన్యాయాన్ని ప్రశ్నించే ఓ యువకుడి కథ ఇది. అందరివాడైన అతడు సమాజంలోని చెడుపై ఎలాంటి పోరాటం చేశాడన్నది ఆకట్టుకుంటుంది. జీవా పాత్ర సరికొత్తగా ఉంటుంది. విలన్‌గా నవదీప్‌ నటించారు.   యాక్షన్‌,లవ్‌, కామెడీ,సెంటిమెంట్‌, మాస్‌ అంశాల కలబోతగా ఉంటుంది. ఫిబ్రవరి 2న చిత్ర గీతాల్ని  విడుదలచేయనున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకురానున్నది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్‌. logo