Loksabha Elections 2024 : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తోసిపుచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించిన అలాంటి వ్యక్తి ఇంతటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం తనను ఆశ్చర్యానికి లోనుచేసిందని అన్నారు. పిట్రోడా వ్యాఖ్యలను తాను అంగీకరించనని, ఆయన మాట్లాడే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
గాందీ కుటుంబంతో కలిసి పనిచేస్తున్నప్పుడు మీరు మరింత బాధ్యతగా ఉండాలని, ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. లోక్సభ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కష్టపడి పనిచేస్తున్నారని, కానీ పిట్రోడా చేసిన ఒకే ఒక్క ప్రకటనతో బీజేపీకి దీన్ని ఓ అంశంగా మలిచే అవకాశం కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు.
మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై మాట్లాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని పిట్రోడాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ మీరు సోఫాలో కూర్చుని చౌకబారు మాటలు మాట్లాడటం సరైంది కాదని వాద్రా పేర్కొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్గా ఆయన రాజీనామా చేయడం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని, పిట్రోడా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ తాను ఆయనకు లేఖ రాశానని వాద్రా తెలిపారు.
Read More :
New car Damaged after Puja | ఆలయంలో పూజల తర్వాత ధ్వంసమైన కొత్త కారు.. వీడియో వైరల్