SSMB 29 Big Update | సూపర్‌స్టార్ మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి – మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు రాజమౌళి. నేడు మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా SSMB29 ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ను పంచుకున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో #ప్రపంచ యాత్రికుడు(GlobeTrotter)ని రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్లో పంచుకున్నాడు. ఈ పోస్టర్లో మహేశ్ బాబు మొహం కనిపించకుండా శివుడి త్రిశులం, నందితో ఉన్న లాకేట్ను ధరించి కనిపిస్తుంది.
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో ప్రియంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్.
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025