టాలీవుడ్ (Tollywood) క్రేజీ కాంబినేషన్లో ఒకటి మహేశ్ బాబు (Mahesh Babu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) రాబోతున్న విషయం తెలిసిందే. అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. ఇటీవలే జర్మనీ వెకేషన్‌కు వెళ్లిన మహేశ్‌బాబును కలిసి కథను వినిపించాడట త్రివిక్రమ్.
మహేశ్ కూడా రెడీ అవడంతో షూటింగ్ షురూ చేసేందుకు రెడీ అవుతున్నారని తాజా టాక్. లేటెస్ట్ సమాచారం ప్రకారం జులై నుంచి చిత్రీకరణ మొదలుకానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశాడట మాటల మాంత్రికుడు. త్వరలోనే మహేశ్ జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టుపై ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నాడని టాక్. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
రీసెంట్గా వచ్చిన సర్కారు వారి పాట చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్. అదే జోష్‌లో త్వరలోనే త్రివిక్రమ సినిమా మొదలుపెట్టి అభిమానులను ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Read Also : Sharwanand | శర్వానంద్‌కు జోడీగా రాశీఖన్నా..షూటింగ్ షురూ ఎప్పుడంటే..!
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్‌తో వస్తున్నాడా..?