SSMB 29| ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరు రాజమౌళి-మహేష్ బాబు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఒడిశాలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులు అందరు ఈ షెడ్యూల్లో పాల్గొనగా, రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలు చీత్రీకరించారు. అయితే సెట్ నుండి ఓ వీడియో లీక్ కావడంతో జక్కన్నతో పాటు చిత్ర బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లీకేజీ వ్యవహారంపై దర్శకుడు రాజమౌళి, చిత్రయూనిట్ కూడా సీరియస్ గా ఉన్నారట. మరోవైపు రాజమౌళి టీమ్ ఈ వీడియోని నియంత్రించడానికి సైబర్ సెక్యూరిటీ సహాయం తీసుకొని ఆ వీడియో పోస్ట్ చేసిన ఫ్యాన్స్, నెటిజన్ల అకౌంట్స్ చేసేస్తున్నట్టుగా తెలుస్తుంది.
దీంతో వీడియో పోస్ట్ చేసిన వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు పోస్ట్ చేశామా అని బాధపడుతున్నారు. ఇక వీడియో లీక్ కావడంతో మహేష్ మూవీ టీమ్ మరింత సెక్యూరిటీని పెంచాలని చూస్తున్నారట. సినిమా నుంచి ఎలాంటి లీక్స్ అవ్వకూడదు అని ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని మూడింతలు పెంచుతున్నారని తెలుస్తుంది. ఒరిస్సా అడవుల్లో భారీ సెక్యూరిటీ నడుమ మూవీ టీమ్ తప్ప ఎవరికీ ప్రవేశం లేకుండా దరిదాపుల్లో ఎవరూ ఫోన్స్ వాడకుండా టైట్ సెక్యూరిటీని పెంచాలని రాజమౌళి భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఈ సినిమా ఒరిస్సా అడవుల్లో షూటింగ్ జరుగుతుంది.
మహేష్ బాబు – విలన్స్ మధ్య షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.. ఇక్కడ ఆఫ్రికాలో ఉండే స్పెషల్ బాంబో చెట్లు సెట్స్ వేయిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం, పృద్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇన్నాళ్లు ఇన్డోర్ లో మూవీ షూటింగ్ జరిగింది కాబట్టి ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు ఔట్‌డోర్ షూటింగ్ అయ్యే సరికి రాజమౌళి అండ్ టీమ్‌కి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.