SS Thaman | టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలకే ఎక్కువగా పని చేస్తున్న థమన్ బాలకృష్ణకు అయితే వరుసగా ఐదు చిత్రాలకు గూస్ బంప్ప్ తెప్పించే మ్యూజిక్ అందించారు. ఇప్పుడు బాలయ్య నటిస్తున్న అఖండ 2 కి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. టాలీవుడ్ లో బిజీయేస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ లైఫ్ లీడ్ చేస్తుండగా, ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా మంచి సక్సెస్ అవుతుంది. అయితే థమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తూనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్, ఇతర సినిమాల్లో క్యామియో అపియరెన్స్ ఇస్తూ తన ఫ్యాన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు.
థమన్ ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడప్పుడు తన సినిమాలకి సంబంధించిన విషయాలే కాక పర్సనల్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తుంటాడు. రీసెంట్గా సీసీఎల్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ తరపున అద్భుతంగా ఆడాడు థమన్. ఇక దీనికి సంబంధించి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ తమన్ ను ఉద్దేశించి కాస్త సెటైరికల్ ట్వీట్ చేశాడు. షార్ట్ కు.. స్లాట్ కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది చూసిన తమన్.. ఎప్పటిలాగే తన స్టైల్లో కౌంటరిచ్చాడు.
“ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు బే” అంటూ రిప్లై ఇచ్చారు తమన్. ఇప్పుడు ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటావ్ అన్నా.. వాళ్లను వదిలేయ్ అన్నా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు థమన్ అఖండ 2 చిత్రం, ఓజీ మూవీతో పాటు పలు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల అఖండ 2 చిత్ర టీజర్ విడుదల కాగా, ఇందులో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.
Ok Ra Vachiii nerchukunntaaa adresss pammpu bae ! https://t.co/B0M6AGbnO7
— thaman S (@MusicThaman) June 25, 2025