SS Rajamouli| సినీ ఇండస్ట్రీలో వారసుల హవా కొత్తేమీ కాదని తెలిసిందే. ఇప్పటికే చాలా మంది నటీనటుల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరు సక్సెస్ ట్రాక్‌లో పయనిస్తుంటే.. మరికొందరేమో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల (Roshan kanakala) డెబ్యూ ప్రాజెక్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. #BG టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) లాంఛ్ చేయనున్నాడు. ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ప్రీ లుక్ పోస్టర్లో హీరోహీరోయిన్లు రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ సిల్వర్‌స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతుందని చెప్పకనే చెబుతున్నాడు డైరెక్టర్. ఈ చిత్రానికి సురేశ్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
BG ప్రీ లుక్‌తో నయా అప్డేట్..
Unveiling the first look and title of #BG with none other than the Pride of Indian Cinema, Mr. @ssrajamouli at 5 PM!!@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @maheshwarimovie @peoplemediafcy @vishwaprasadtg @vivekkuchibotla @SricharanPakala @ananth_designer… pic.twitter.com/9x8UfyWO4v
— Suresh PRO (@SureshPRO_) October 5, 2023