SSMB 29 | ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమా రేంజ్‌ను గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి చాటి చెప్పాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ స్టార్ డైరెక్టర్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29)కి ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంఛ్ కాబోతుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది జక్కన్న టీం.
తాజా అప్డేట్ ప్రకారం ఎస్ఎస్ఎంబీ 29 మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న లాంఛ్ కానుంది. యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో ఇండియానా జోన్స్ లైన్స్ లో జంగిల్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉండబోతుండగా.. చాలా జంతువులు కనిపించబోతున్నాయి. సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. అమీర్ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. 2024లో షూటింగ్ షురూ అయ్యే కంటే ముందు ప్రీ విజువలైజేషన్, ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహించబోతున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ఉండబోతుందని సమాచారం. 2025 సెకండాఫ్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.
మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 28గా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
#SSMB29 – Mahesh Babu & Rajamouli’s Magnum Opus to be Officially Launched on Aug 9..🔥 (Mahesh Babu’s Birthday)
• Said to be an Action Adventure on the lines of Indiana Jones..⭐ and Film is said to feature lot of animals..🤙
• Currently the Film is in Scripting stage and… pic.twitter.com/jXoqId4zMS
— Laxmi Kanth (@iammoviebuff007) June 12, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..