పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam) థియేటర్లకు రానే వచ్చింది. పూజాహెగ్డే (Pooja hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందనేదానిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే దర్శకదిగ్గజం రాజమౌళి ( SS Rajamouli)కి ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ చాలా బాగా నచ్చేసిందట. ప్రభాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు జక్కన్న.
Radhe Shyam Budget | రాధేశ్యామ్‌లో ఆ ఒక్క దానికే రూ.75 కోట్లు పెట్టారా..?
రాజమౌళి హైదరాబాద్‌లో రాధేశ్యామ్ స్పెషల్ షోకు హాజరయ్యాడు. అయితే ఈ మూవీలో క్లైమాక్స్ ఎపిసోడ్లో షిప్ సన్నివేశాలు చాలా బాగున్నాయని కితాబిచ్చాడు. ఆ ఎపిసోడ్ హాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ టైటానిక్‌ను స్పూర్తిగా తీసుకుని చేశారని అన్నాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాపై ఇలా ప్రశంసలు కురిపించే సరికి ఎన్నో నెలలుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ టీంకు ఊపిరి పోసినట్టైంది.
Rashmika Habibo dance | హబిబో సాంగ్‌కు బీచ్‌లో రష్మిక, వరుణ్ డ్యాన్స్ అదిరింది..వీడియో