రాధేశ్యామ్ (Radhe Shyam), ఆర్ఆర్ఆర్ (RRR)..మూవీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక సినిమా కోసం వేసిన సెట్స్ లో మరో సినిమా షూటింగ్స్ చేయడం చూస్తుంటాం. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే మరో సినిమాను షూట్ చేస్తుంటారు.
రెండు ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు..అందులోనా పాన్ ఇండియా చిత్రాలు ఒక మూవీ సెట్స్ లో మరో మూవీ చిత్రీకరణ చేస్తే ఎలా ఉంటుంది. అలాంటిదే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ విషయాల్లో కూడా జరిగింది. రాధేశ్యామ్ మేకర్స్ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో యూరోపియన్ స్టైల్ భవంతులు, సెట్స్ వేశారు. అయితే రాజమౌళి (Rajamouli) కుమారుడు కార్తికేయ రాధేశ్యామ్ సెట్స్ లో ఒక రోజు షూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభాస్‌ను రిక్వెస్ట్ చేశాడట.
దీంతో ఆర్ఆర్ఆర్లో అలియాభట్‌పై వచ్చే ఓ సన్నివేశం కోసం సెట్స్ లొకేషన్‌ను వాడుకున్నారట జక్కన్న టీం. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీన్లు చిత్రీకరిస్తున్న సమయంలో రాధేశ్యామ్ షూటింగ్ కోసం ప్రభాస్ అక్కడే ఉన్నాడట. లొకేషన్లో చాలా కాలం తర్వాత ప్రభాస్, జక్కన్న అలా కలిశారట. అంతేకాదు డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ (Radha Krishna Kumar) అదే లొకేషన్లో కొన్ని సీన్లు తీసినట్టు టాక్.
అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన లొకేషన్లు ఒకటే అయినా..విజువల్ ఎఫెక్ట్స్ , బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా మార్చినట్టు తెలుస్తోండగా..మరి సిల్వర్ స్క్రీన్‌పై ఆ రెండింటి మధ్య తేడా కనిపిస్తుందా..? లేదా అనేది చూడాలి.