Rashmika Habibo dance | హబిబో సాంగ్‌కు బీచ్‌లో రష్మిక, వరుణ్ డ్యాన్స్ అదిరింది..వీడియో
ఇటీవలే పుష్పలో శ్రీవల్లి పాత్రతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది రష్మిక మందన్నా(Rashmika Mandanna) . సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన తొలి హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu) త్వరలో విడుదల కానుంది.
రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇక బాలీవుడ్లో కూడా క్రేజ్ చూపించే పనిపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే పుష్పలో శ్రీవల్లి పాత్రతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన తొలి హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu) త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ (Varun Dhawan)తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. బీచ్‌లో ఓ పాటను షూట్ చేస్తున్నారు. సినిమాలోని సాంగ్ షూట్‌ను కొద్దిసేపు పక్కన పెట్టి..మోస్ట్ ట్రెండింగ్ పాటకు స్టెప్పులేసింది రష్మిక.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న బీస్ట్ చిత్రంలోని హలమితి హబిబో సాంగ్ (Halamithi Habibo) ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షార్ట్ డ్రెస్ విత్ జీన్స్ కోటులో ఉన్న రష్మిక, వరుణ్ ధవన్‌తో కలిసి ఇరగదీసే స్టెప్పులేసి అదరహో అనిపించింది. ఇసుకలో డ్యాన్స్..అంటూ వీడియోను షేర్ చేశాడు వరుణ్ ధావన్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే ఈ పాటకు స్టార్ హీరోయిన్లు సమంత, కీర్తిసురేశ్ డ్యాన్స్ చేసిన నెట్టింట్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. రష్మిక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప ది రూల్‌లో నటిస్తోంది. దీంతోపాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్‌బై సినిమాలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

