తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో చూపించాడు. ఈ సినిమాతో వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ భారత సినీ పరిశ్రమవైపు చూసేలా చేశాడు జక్కన్న. ఈ స్టార్ డైరెక్టర్ అరుదైన ఆహ్వానం అందుకున్నాడు. లాస్ ఏంజెల్స్ లో 13వ వార్షిక గవర్నర్స్ అవార్డుల (13th annual Governors Awards) కార్యక్రమానికి హాజరయ్యాడు.
జక్కన్న స్టైలిష్ బ్లాక్ సూట్లో ఈవెంట్‌కు హాజరయ్యాడు. రాజమౌళితోపాటు కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా సేమ్ సూట్లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఈవెంట్ సందర్భంగా బ్యూటీఫుల్ లొకేషన్లో తండ్రీకొడుకులిద్దరూ కెమెరాకు ఫోజులివ్వగా.. ఈ ఫొటోలను కార్తికేయ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
వచ్చే ఏడాది మహేశ్‌బాబుతో చేయబోతున్న సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
ఎపిక్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను రాంచరణ్ (Ram Charan) పోషించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటించాడు. అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
ట్రెండింగ్‌లో జక్కన్న స్టైలిష్ లుక్స్..
❤️🔥❤️🔥❤️🔥 @ssrajamouli pic.twitter.com/V3ZNratBtg
— S S Karthikeya (@ssk1122) November 20, 2022
డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
అవార్డ్స్ సెర్మనీలో జక్కన్న లుక్.. వీడియో
Ace director @ssrajamouli at the Governors Awards.#GovernorsAwards #Rajamouli #RRR pic.twitter.com/ZIU5E0kWiK
— Suresh Kondi (@SureshKondi_) November 20, 2022