SS Rajamouli | మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని (Nani), కీర్తిసురేశ్ (Keerthy Suresh) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సింగరేణి ఏరియాలో వీర్లపల్లి గ్రామం చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చిన దసరాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్ తమ పాత్రలకు ప్రాణం పోశారంటున్నారు సినీ జనాలు. కాగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) రివ్యూ ఇచ్చాడు.
శ్రీకాంత్ ఒదెల కఠినమైన ప్రకృతి దృశ్యమానంలో ముడి పాత్రల మధ్య హృదయాన్ని హత్తుకునే సున్నితమైన ప్రేమకథను నడిపించాడు. ఇది నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. కీర్తి సురేశ్ తన పాత్రలో జీవించేసింది. దసరాలో ప్రతీ నటీనటుల నటన చెప్పుకోదగ్గది. ఫస్ట్ క్లాస్ సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది. దసరా బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అద్భుత విజయం అందుకున్న దసరా చిత్రయూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు.. అని ట్వీట్ చేశాడు జక్కన్న. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
దసరా టీజర్‌పై ఇప్పటికే జక్కన్న స్పందిస్తూ.. ‘దసరా విజువల్స్ చాలా బాగున్నాయి. నాని మాస్ లుక్ మేకోవర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. కొత్త దర్శకుడు వంశీ ఇలాంటి ప్రభావాన్ని చూపించడం అద్బుతంగా ఉంది. చివరి షాట్ అయితే తోపు. శ్రీకాంత్ ఓదెల అండ్ టీంకు ఆల్ ది బెస్ట్’ అంటూ శ్రీకాంత్ ఓదెల టీంలో జోష్ నింపిన విషయం తెలిసిందే. జక్కన్న తాజాగా సినిమాపై రివ్యూ ఇవ్వడంతో ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు.
దసరాలో సముద్రఖని, సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, పూర్ణ, జరీనా వహబ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. దసరా ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
దసరాపై జక్కన్న రివ్యూ ఇలా..
Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career best performance by Nani. Keerthy cake walks through her role.
Every actor’s performance was note worthy. Cinematography is first class. Special mention to the…
— rajamouli ss (@ssrajamouli) April 3, 2023
Read Also :
Meera Jasmine | క్వీన్ ఎలిజబెత్‌గా పవన్‌కల్యాణ్ హీరోయిన్.. వివరాలివే
Bhuvana Vijayam | సునీల్ భువన విజయమ్ నుంచి కథన కదనమున లిరికల్ వీడియో సాంగ్
Nayanthara | నయనతార కవల పిల్లల పేర్లేంటో తెలుసా..?