SSMB 29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన వార్త ఒకటి ఈ విషయంపై మూవీ లవర్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? ఈ సినిమా కోసం జక్కన్న రెండు పాపులర్ పుస్తకాలను రెఫరెన్స్‌గా తీసుకోబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆఫ్రికన్ రైటర్ విల్బర్ స్మిత్ రాసిన The Triumph of the sun, king of kings పుస్తకాల రైట్స్‌ను రాజమౌళి కొనుగోలు చేశాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా మారింది. మూవీ లవర్స్ ఇంకేంటి ఆ రెండు పుస్తకాలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
ఈ చిత్రాన్ని గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానుగుణంగా హాలీవుడ్ స్టార్తోపాటు వివిధ భాషలకు చెందిన పాపులర్ యాక్టర్లు కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఎస్ఎస్ఎంబీ కోసం రామోజీఫిలిం సిటీలో రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారన్న వార్త కూడా ఇప్పటికే ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తుందట. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో స్టైలిష్ లుక్‌లోకి మేకోవర్ అయ్యాడని తెలిసిందే.
Exclusive : Director @ssrajamouli bought rights of a African writer WILBER SMITH’s these two books for #SSMB29 🦁🔥 pic.twitter.com/U3lsQWUh0V
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) June 12, 2024