శ్రీరామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ది మేజ్’. రవికిరణ్ గడలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ కె రెడ్డి, కె.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చుట్టూ నడిచే కథ ఇది.
అతని కలల ప్రపంచం, జ్ఞాపకాలు, గ్రహణ శక్తి వంటి అంశాలను ఆవిష్కరిస్తూ ఆసక్తికరంగా సాగుతుంది. నిజం అంటే ఏమిటి అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. వాస్తవం, భ్రమల మధ్య నడిచే ఈ కథ ప్రేక్షకులకు అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తుంది’ అన్నారు. ప్రియాంకశర్మ, హృతిక శ్రీనివాస్, అజయ్, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవికిరణ్ గడలే.