మనందరిలో ఒకరి కథ
నటుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తుంటారు అవసరాల శ్రీనివాస్. ఆయన రూపొందించిన గత చిత్రాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ మంచి విజయాలు సాధించాయి.
నటుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చూపిస్తుంటారు అవసరాల శ్రీనివాస్. ఆయన రూపొందించిన గత చిత్రాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ మంచి విజయాలు సాధించాయి. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ రూపొందించిన తాజా సినిమా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. ఈనెల 17న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు అవసరాల శ్రీనివాస్.
సహజత్వంతో కూడిన చిత్రమిది
నిజజీవితంలో నేను చూసిన కొన్ని సందర్భాలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ ఇది. మనలో ఒకరి కథలా ఉంటుంది కాబట్టి టైటిల్ కూడా సహజంగా ఉండాలనుకున్నాను. నా గత చిత్రాలకు భిన్నమైన శైలిలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో ఏడు చాఫ్టర్లు ఉంటాయి. ఒక్కో అధ్యాయం నిడివి 20 నిమిషాలు ఉంటుంది. పదేండ్ల వ్యవధిలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ కాల పరిమితిలో హీరో హీరోయిన్ల జీవితంలో గడిచిన 18 నుంచి 28 ఏండ్ల కథ ఆసక్తికరంగా చూపిస్తున్నాం.
నాగశౌర్య నటన ఇష్టం
శౌర్య నటనను ఇష్టపడతాను. ముఖ్యంగా ఈ కథ నటీనటుల పర్మార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఎంత బాగా నటిస్తే సన్నివేశాలు అంత బాగా వస్తాయి. షూటింగ్లో ఇబ్బందులు ఉంటే అవి నాగశౌర్య నటన చూసి మర్చిపోయేవాడిని. నానితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో సినిమా చేస్తాను. ఇకపై ఎక్కువగా దర్శకత్వంపైనే దృష్టి పెడతా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

