కల్యాణ్‌రామ్ నటించిన గత మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఈ ఏడాది వచ్చిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ కూడా నిరాశపరచింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ భారీ హిట్‌తో కమ్‌బ్యాక్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రచయిత శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో ఆయన ఓ చిత్రానికి అంగీకరించినట్లు తెలిసింది.
‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాల రచయితల్లో ఒకరిగా శ్రీకాంత్ విస్సా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో కల్యాణ్‌రామ్ ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.