శ్రీకాంత్ గుర్రం, బుజ్జి జంటగా రూపొందుతున్న చిత్రం ‘నిన్నే చూస్తు’. కే.గోవర్దనరావు దర్శకుడు. పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మాత. సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ఆడియోను సంగీత దర్శకుడు మణిశర్మ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు, ప్రేమికులకు అర్ధమయ్యే రీతిలో ఈ సినిమాను చిత్రీకరించాం. రమణ రాథోడ్ అందించిన సంగీతం అలరిస్తుంది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.