Srikanth Addala | డైరెక్టర్ వంశీ అనగానే గోదారి గుర్తొస్తుంది. శ్రీకాంత్ అడ్డాల అనగానే గోదావరి నేటివిటీ గుర్తొస్తుంది. కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలను అంతబాగా మలిచారాయన. ఆ తర్వాత వచ్చిన ‘ముకుంద’ కూడా పర్లేదనిపించింది. అయితే.. మహేశ్‌బాబుతో చేసిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో శ్రీకాంత్ అడ్డాలకు కష్టాలు మొదలయ్యాయి.
తన శైలికి భిన్నంగా తీసిన ‘పెదకాపు’ కూడా నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత కన్నడంలో సినిమా చేయాలనుకున్నారు. అదీ కుదర్లేదు. అందుకే.. ఇప్పుడు మళ్లీ తనకు కలిసొచ్చిన జానర్లో కథ తయారు చేసుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. ‘కూచిపూడి వారి వీధి’ అని టైటిల్ కూడా పెట్టేశారు. గతంలో అన్నదమ్ముల కథగా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తీశారాయన. ఇప్పుడు అక్కచెల్లెళ్ల కథగా ఈ ‘కూచిపూడి వారి వీధి’ తీయబోతున్నారు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు మంచి హీరోయిన్ల కోసం శ్రీకాంత్ అన్వేషిస్తున్నారట. ఆ ఇద్దరూ సెట్ అయితే.. ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది.