Sridevi | అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతిలోక సుందరిగా ఎందరో మనసులు గెలుచుకుంది.అందానికి అందం, మంచి నటనతో మెప్పించిన శ్రీదేవి.. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. అయితే అనూహ్యంగా 54 ఏళ్ల వయస్సులో కన్నుమూసారు శ్రీదేవి. శ్రీదేవి మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. శ్రీదేవి తెలుగులో చిరంజీవి జోడీగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చేయగా, అప్పటి నుండే ఆమెని అతిలోక సుందరి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
కప్పుడు శ్రీదేవి అంటేనే ఒక సంచలనం. స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం. అంతెందుకు చాలా మంది స్టార్ హీరోలు సైతం శ్రీదేవి డేట్స్ కోసం ఎదురు చూసేవాళ్లంటే ఆమె స్థాయి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శ్రీదేవి మరణించిన కూడా ఆమెకి సంబంధించిన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా శ్రీదేవి ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారనే దానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీదేవి ఏ పని చేసిన కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టుకునేదట. తన కుటుంబం కోసం అయితే శ్రీదేవి చాలా కండీషన్స్ పెట్టేదని సమాచారం. అయితే ఆమె పెట్టిన కండీషన్స్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.
శ్రీదేవి పెట్టిన కండీషన్స్ ఏంటంటే.. ఇంట్లో అందరు కలిసి కూర్చొని టిఫిన్, లంచ్ లేదా డిన్నర్ చేయాలనే వారట. భోజనం చేసేటప్పుడు ఎవరి చేతిలో కూడా మొబైల్ ఉండకూడదు అనేవారట. టీవీ చూడకూడదు, సినిమాలకి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేయకూడదు. తినే సమయంలో కేవలం కుటుంబం గురించి కబుర్లు చెబుకుంటూ భోజనం చేయాలని శ్రీదేవి అనేవారట. ఇప్పుడు శ్రీదేవి లేకపోయిన కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమె పెట్టిన కండిషన్లను ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.