Sridevi | అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి చాన్నాళ్లే అవుతున్నా కూడా ఆమెకి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఆమె సినిమాలు, మరణం, ఫ్యామిలీ ఇలా అనేక అంశాలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంటాయి. శ్రీదేవి అంటే అప్పట్లో సంచలనం. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసేవారు. దక్షిణాదిన, ఉత్తరాదిన శ్రీదేవి అంటే ఒక బ్రాండ్. మోస్ట్ సక్సెస్ రేషియా ఉన్న హీరోయిన్లలో శ్రీదేవినే టాప్ కావడంతో ఆమెతో కలిసి పని చేసేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపుతుంటారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండియన్ ఇండస్ట్రీలో ఏక ఛక్రాధిపత్యం వహించిన అందాల హీరోయిన్ శ్రీదేవి. 1970లో వచ్చిన ‘మా నాన్న నిర్దోశి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి 1978లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాతో తిరుగులేని క్రేజ్ దక్కింది. ఆ తర్వాత కార్తిక దీపం, వేటగాడు, ప్రేమాభిషేకం, ఆఖరి పోరాటం, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా తెలుగులో హిట్ల మీద హిట్లు కొడుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. శ్రీదేవి తన కెరియర్లో రెండు తరాల హీరోలతో కలిసి పని చేసింది. అటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు నుంచి చిరంజీవి, వెంకీమామ వంటి హీరోలతోను కలిసి పని చేసింది.
అయితే శ్రీదేవి మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. 2018లో దుబాయ్‌లోని హోటల్ గదిలో బాత్ టబ్‌లో శవమై తేలింది శ్రీదేవి. ఈ వార్త అందరిని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీదేవి లాంటి హీరోయిన్‌కి ఇలాంటి చావేంటని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె చావు వెనుక మిస్టరీ కూడా ఉందని ఇప్పటికీ పలువురు భావిస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఆమె చావు వెనుక ఓ నెంబర్ ఉందని తెలుస్తుంది. శ్రీదేవి పుట్టిన తేదీ ప్రకారం.. శ్రీదేవి మూలాంకం 4. అలా 4వ నెంబర్ ఉన్న వాళ్ల చావు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. 4 సంఖ్యకు రాహువు ప్రభావంలో ఉండడం వలన వీళ్ల జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయట. కష్టపడతారు, కొత్త మార్పులని అంగీకరించడంలో కాస్త అప్రమత్తంగా ఉంటారు. కాని వారి చావు అనూహ్యంగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో మరి..