కరోనా కాలంలో ఉదయం నుండి రాత్రి దాకా విషాదకరమైన వార్తలే వింటున్నాం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల స్నేహితుడు జీవన్ కిషోర్ వర్మ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆస్పత్రి ఖర్చుల కోసం దాదాపు పది లక్షల మేరకు అవసరం ఉన్నట్టు తెలుస్తోంది. అతనికి సాయం అందించేందుకు శ్రీ చరణ్ కీట్టో సంస్థ ద్వారా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
గూఢచారి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ చరణ్ పాకాల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన ఫ్రెండ్‌కు సాయం చేయాలంటూ అడివి శేష్, సత్యదేవ్,కోన వెంకట్‌లను కోరాడు. ఇందులో ఇప్పటికే సత్యదేవ్ స్పందించారు. తన వంతు సాయం చేసేశాను అంటూ ట్వీట్ వేశారు సత్యదేవ్. సాయం చేసినందుకు చేతులెత్తి మొక్కారు శ్రీచరణ్. ఈ విషయాన్ని వీలైనంత మందికి షేర్ చేసి సాయపడాల్సిందిగా అందరినీ కోరారు. శ్రీచరణ్ పాకాల కెరీర్ విషయానికొస్తే.. క్షణం, గరుడవేగ, అశ్వథ్థామ, గూఢచారి వంటి సినిమాలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
A friend of mine who is a budding photographer met with an accident and fighting for Life. We need a helping hand to save his life. I've done my part. Request you to spread the word @ActorSatyaDev @vamsikaka @AdiviSesh @konavenkat99https://t.co/cfJUltnJFF
— Sricharan Pakala (@SricharanPakala) June 6, 2021