కొత్త కథ చెప్పాలనుకున్నాం..!
శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సతీష్ త్రిపుర దర్శకుడు. డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలు. ఈ నెల 23న విడుదలకానుంది. గురువారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సతీష్ త్రిపుర దర్శకుడు. డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మాతలు. ఈ నెల 23న విడుదలకానుంది. గురువారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. శ్రీసింహా మాట్లాడుతూ ‘వినూత్నమైన కాన్సెప్ట్ ఇది. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ అనుభవం సినిమాకు బాగా తోడ్పడింది.
సినిమా ఆసాంతం ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ‘ప్రేక్షకులకు కొత్త కథ చెప్పాలనే లక్ష్యంతో సురేష్‌బాబు, నేను ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఇదివరకెప్పుడూ చూడని కొత్త అనుభవాన్నిస్తుంది. కాలభైరవ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’అని నిర్మాత సునీత తాటి చెప్పారు. దర్శకుడు సతీష్ త్రిపుర మాట్లాడుతూ ‘తెలుగులో వస్తున్న తొలి సర్వైవల్ థ్రిల్లర్ ఇది. కాలభైరవ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశం థ్రిల్‌ను పంచుతూ సాగుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

