శ్రీసింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘మత్తు వదలరా..’. 2019 డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే.. ఈ సినిమా సీక్వెల్ ‘మత్తు వదలరా 2’ని కూడా కామ్‌గా మేకర్స్ పూర్తి చేసేశారు.
సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానున్నదని తెలియజేస్తూ సోమవారం ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో యాక్షన్ మోడ్‌లో ఉన్న శ్రీసింహా, సత్యలను చూడొచ్చు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీమేకర్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.