బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్‌గా 8 వారాలు పూర్తి చేసుకుంది. సోమవారం 9వ వారంకి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ జరిగింది.ఇందులో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దర్ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలను తెలియజేసి నామినేట్ చేయాలనుకున్న సభ్యుడి ముఖంపై తెల్లటి క్రీమ్‌ని పూయాలని చెప్పారు బిగ్ బాస్. షణ్ముఖ్ కెప్టెన్ కావడంతో అతడిని నామినేట్ చేయోద్దని అన్నారు.
ముందుగా మానస్ .. నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాడు. మానస్.. శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేశాడు. జెస్పీ సంచాలకుడిగా సరిగా చేయలేదని.. శ్రీరామ్‌తో కనెక్షన్ కుదర్లేదని చెప్పాడు మానస్. ఈ క్రమంలో శ్రీరామ్, మానస్‌కి మధ్య చాలాసేపు డిస్కషన్ నడిచింది. ఇక సిరి.. సన్నీ, ఆనీ మాస్టర్లను నామినేట్ చేసింది. సన్నీ ఆట నచ్చలేదని చెప్పిన సిరి.. అనీ మాస్టర్ ఆటలో గివ్ అప్ ఇచ్చేయడం నచ్చలేదని పేర్కొంది. ఇంకోసారి ఆటలో షణ్ముఖ్‌తో నా ఫ్రెండ్ షిష్ గురించి తీసుకు రావొద్దని హెచ్చరించింది.నా ఆట నేను ఆడుతున్నా అని పేర్కొంది.
శ్రీరామ్.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు. మీరు గ్రూపులుగా ఉంటూ నన్ను గ్రూపులు అనడం నచ్చలేదు. మానస్ తో మాట్లాడుతూ.. నీతో మాట్లాడినా ప్రాబ్లమే.. మాట్లాడకపోయినా పర్లేదు.. అందరికీ ఒక్క మాస్క్ ఉంటే.. నీకు ఐదారు మాస్క్‌లు ఉన్నాయి అంటూ ఫోమ్ తీసుకెళ్లి ఆయన ముఖంపై దట్టంగా పూశాడు శ్రీరామ్.