‘మహానటి’ తర్వాత ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై మరో లేడీ ఓరియెంటెడ్ డ్రామా తెరకెక్కనున్నది. ఈ సినిమాకు ‘చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా..’ అనే టైటిల్ను ఖరారు చేశారట. శ్రీలీల ఇందులో మెయిన్ లీడ్ చేయనున్నారని సమాచారం. ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇది అద్భుతమైన కథ అని తెలుస్తున్నది.
కథానాయికగా శ్రీలీల పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఈ కథకు ఎవరు కథానాయికగా నటించినా కచ్ఛితంగా మంచి పేరు వస్తుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నది. ప్రస్తుతం మోహిత్ సూరి దర్శకత్వంలో బాలీవుడ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్న శ్రీలీలకు టాలీవుడ్లో ఇది నిజంగా బంపర్ ఆఫరే అనాలి. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సివుంది.