అచ్చ తెలుగందం శ్రీలీల ఇప్పుడు కెరీర్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామకు దక్షిణాదితో పాటు హిందీలో కూడా వరుస ఆఫర్లొస్తున్నాయి. అయితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తున్నదని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ప్రైవేట్ వేడుకలకు కూడా ఈ భామ హాజరు కావడంతో వీరిద్దరి బంధం సమ్‌థింగ్ స్పెషల్ అనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది శ్రీలీల.
షూటింగ్ సమయంలో అమ్మ ఎప్పుడూ తనతోనే ఉంటుందని, అలాంటప్పుడు ఇక ప్రేమలో పడే చాన్సెక్కడిదని నవ్వుతూ చెప్పింది. ‘నేను ప్రేమలో ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ నాకు ఆ చాన్స్ లేదు. షూటింగ్ రోజుల్లో అమ్మ నాతోనే ఉంటుంది. ఈ మధ్య మియామి వెళ్లినప్పుడు కూడా అమ్మను తీసుకెళ్లా. అయినా నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి’ అని శ్రీలీల చెప్పింది. పెళ్లి గురించి మాట్లాడుతూ ‘ఇప్పుడు నాకు 23 ఏళ్లు. ఎంత కాదన్నా ముప్పైఏళ్ల వరకు మాత్రం పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదు’ అని క్లారిటీనిచ్చింది.