నా బాల్యం గుర్తుకొచ్చింది!
మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలీడేస్'. శ్రీకర్ దర్శకత్వంలోధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
మాస్టర్ రోహన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలీడేస్’. శ్రీకర్ దర్శకత్వంలోధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హీరో శ్రీవిష్ణుముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే
చిన్నప్పుడు ఊరు వెళ్లిన జ్ఞాపకాలు, తన బాల్యం గుర్తుకొచ్చిందని, పిల్లలంతా అద్భుతంగా నటించారనిప్రశంసించారు.
ప్రతీ ప్రేక్షకుడి గుండెను తాకే సినిమా ఇదని, కొన్నాళ్లపాటు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారని దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘చిన్నపిల్లల సినిమా చేస్తున్నావ్? థియేటర్‌కు ఎవరొస్తారని చాలా మంది సందేహపడ్డారు. ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తే ఇదే తరహాలో నెలకో సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. పిల్లల కంటే పెద్దలే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

