దక్షిణాదిలోని నాలుగు రాష్ర్టాలకు చెందిన టీవీ నిర్మాతల మండళ్లు కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్'(TOPCOS) సంస్థను అధికారికంగా ఏర్పరచినట్టు సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్, బైలాస్ ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్టు వారు పేర్కొన్నారు. సంస్థ అధ్యక్షుడు ఏ ప్రసాద్‌రావు మాట్లాడుతూ ‘ఇది చారిత్రాత్మక దినం.
నాలుగు రాష్ర్టాల నిర్మాతల మండళ్లు కలసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడటం ఇదే ప్రథమం. దీని వెనుక రెండేళ్ల కృషి ఉంది. టెలివిజన్, ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ చొరవ వల్లే ఇది సాధ్యమైంది. నాలుగు రాష్ర్టాల టీవీ పరిశ్రమలకు, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు.. ఇలా అందరికీ పెద్ద దిక్కులా, అందర్నీ సమన్వయ పరుస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ ఈ సంస్థ ముందుకెళ్తుంది’ అని తెలిపారు.