North Audiance | సౌత్ సినిమాల డామినేషన్ నార్త్‌లో ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాప్-5 ఆల్ టైమ్ గ్రాసర్లలో మూడు సౌత్ సినిమాలే ఉండటం విశేషం. ముఖ్యంగా కరోనా తర్వాత సౌత్ సినిమాల తాకిడికి బాలీవుడ్ ఖాన్లు, కపూర్లు సైతం కిందికి పడిపోయారు. హిందీలో బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టడానికి ఏకంగా ఆరేళ్లు పట్టింది. ఈ మధ్య పఠాన్, గదర్-2 వంటి సినిమాలతో కాస్త కుదుటపడింది. మొన్న రిలీజైన జైలర్ సైతం హిందీలో ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో చాలా మంది హిందీ ప్రేక్షకులు సౌత్ సినిమాలు, దర్శకులను నెత్తిన పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇక అక్కడి హీరోలు సైతం సౌత్ దర్శకులతో సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నారు.
ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ సౌత్ సెన్సేషన్ అట్లీతో చేతులు కలిపి జవాన్ తీశాడు. రెండు రోజుల కిందట రిలీజైన హిందీ నాట సృష్టిస్తున్న రికార్డులు అంతా ఇంతా కాదు. తొలి రోజే రూ.65 కోట్ల నెట్ కలెక్షన్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఇక రెండొ రోజు కూడా దాదాపు రూ.50 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. ఇక కొన్ని ఏరియాల్లో సినిమాను చూడడానికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో థియేటర్లకు వస్తున్నారంటే.. జవాన్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా అట్లీ టేకింగ్‌కు, ఎలివేషన్లకు జనాలు వెర్రెత్తిపోయారు. ఇక షారుఖ్ అభిమానులైతే అట్లీ ఎక్కడైన పొరపాటున కనిపిస్తే పూజలు, పురస్కారాలు చేసిన ఆశ్చర్యపొనక్కర్లేదు. అంతలా ఆనంద పడుతున్నారు.
నిజానికి ఈ సినిమా కథ అంత గొప్పగా ఏమి ఉండదు. పైగా మన సౌత్‌లో ఇలాంటి సినిమాలు ఎన్నో చూశాం. కానీ కథ చుట్టూ అట్లీ అల్లుకున్న స్క్రీన్‌ప్లేకు ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఇక అట్లీ తీసిన జవాన్‌కే హిందీ ప్రేక్షకులు ఇలా అయితే.. డిసెంబర్లో దాడి చేయనున్న సందీప్ రెడ్డి యానిమల్ సినిమాకు బాలీవుడ్ జనాలు ఇంకేమైపొతారో అంటూ ట్విట్టర్లో మనవాళ్లు రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే యానిమల్ ప్రీ టీజర్‌కు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటిది సందీప్ యానిమల్ సినిమాను ఇంకా ఏ స్థాయిలో రూపొందించాడో ఊహకు కూడా అందనిది.
సందీప్ రెడ్డి కబీర్ సింగ్ టైమ్‌లో ఓ సందర్భంలో అందరూ కబీర్ సింగ్‌ను వైలెంట్ సినిమా అంటున్నారు.. వీళ్లకు అసలైన వైలెంట్ సినిమా అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. ప్రీ టీజర్‌తో ఆ మాటలు నిజమేనని స్పష్టం అయ్యాయి. ప్రీ టీజర్లో మాస్క్‌తో ఉన్న రౌడీ మూకలను రణ్‌బీర్ విచక్షణ రహితంగా గొడ్డలితో నరికిన విజువల్స్‌ను ఇప్పుడప్పుడే మర్చిపోలేము. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇదొక బ్లడ్ బాత్ స్టోరీ అని, ఓ ఫేమస్ ఫిజిక్స్ ప్రొఫెసర్ నుంచి ఓ వ్యక్తి రూత్‌లెస్ గ్యాంగ్స్టార్లా ఎలా మారాడు? ఎందుకు మారాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట.
కేవలం స్టోరీ లైన్ వింటుంటూనే రోమాలు నిక్కబోరుచుకుంటున్నాయి. అదే స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై విజువల్‌గా చూస్తే గూస్బంప్స్ అనే మాట కూడా చిన్నదే అయిపోతుంది. ఇక నార్త్ ఆడియెన్స్ సంగతి సరే సరి. అసలు సిసలైన రక్త పాతం అంటే ఎంటో చూపించడానికి సందీప్ సిద్దమౌతున్నాడు. పాతికేళ్ల కిందట ఆర్జీవి తెరకెక్కించిన సత్యకే నార్త్ ఆడియెన్స్ చొక్కాలు చింపుకున్నారు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి అప్డేట్ వెర్షన్ రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌ను చూసి ఏమైపోతారో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.