న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్ట్రెస్, మోడల్ సోఫీ చౌదరీ.. మాల్దీవుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి బీచ్‌లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇక ఇంటర్నెట్లో ఆ ఫోటోలకు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి. సముద్ర నీటిలో బికినీ వేసుకుని దిగిన సోఫియా ఫోటోలు తన ఫ్యాన్స్‌ను కేక పుట్టిస్తున్నాయి. సెగలు చిమ్ముతున్న ఆ ఫోటోలకు కామెంట్లు కూడా జోరుగా కురుస్తున్నాయి. ఫైర్ ఎమోజీలతో నీల్ నితిన్ ముఖేశ్ ఆ ఫోటోలకు రియాక్ట్ అయ్యాడు. సోఫి చౌదరీ ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మాల్దీవుల్లోనే గడుపుతోంది. బోట్ రెయిడ్స్‌ను ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో డాల్ఫిన్లను ఛేజ్ చేస్తూ కాలం గడిపేస్తోంది. సూర్యాస్తమయ వేళ డాల్ఫిన్లు ఆటలాడేందుకు బయటకు వస్తాయని ఓ ఫోటోకు సోఫీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. చాలా వరకు టీవీ షోలకు సోఫీ చౌదరి హోస్ట్‌గా వ్యవహరించింది. ఎంటీవీలో లవ్‌లైన్, జలక్ దిక్లా జా 7 లాంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా చేసింది. ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మనీ హై తో హనీ హై, ఆ దేకే జరా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా లాంటి చిత్రాల్లో ఆమె నటించింది.