Sony Liv Stories | ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పలు క్రేజీ వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ చిత్రాల స్ట్రీమింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇక ఏ ఏ చిత్రాలు సోనీ లివ్‌లో రాబోతున్నాయి అనేది చూసుకుంటే.
వెబ్ సిరీస్‌లు – సినిమాలు
స్కామ్ 2010
‘స్కామ్ 1992’ మరియు ‘స్కామ్ 2003’ సిరీస్‌లతో సూపర్హిట్లను అందుకున్న సోనీ లివ్ ఇప్పుడు అదే జానర్లో కొత్త వెబ్ సిరీస్‌ను తీసుకువస్తుంది. ది సుబ్రతా రాయ్ సాగా (Scam 2010: The Subrata Roy Saga) అంటూ ఈ వెబ్ సిరీస్ రాబోతుండగా.. సహరా వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ జీవితం ఆధారంగా రూపొందింది.
మహారాణి సీజన్ 4 (Maharaani)
బీహార్ పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు నాలుగో సీజన్‌తో అలరించబోతుంది. హుమా ఖురేషీ ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సీజన్‌తో స్టార్ నటులు సందడి చేయబోతున్నారు.
గుల్లక్ సీజన్ 5 (Gullak Season 5): మధ్యతరగతి మిశ్రా కుటుంబం కథతో సాగే ఈ సిరీస్ ఐదో సీజన్‌తో రానుంది.
అన్దేఖీ సీజన్ 4 (Undekhi Season 4): ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తన నాలుగో సీజన్‌తో రాబోతోంది.
బ్లాక్ & వైట్ (Black & White): ప్రముఖ నటుడు జగపతి బాబు నటించిన ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ పోలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది.
బృందా సీజన్ 2 (Brinda Season 2): త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ రెండవ సీజన్‌తో రాబోతోంది.
ఇంకా ఇవే కాకుండా
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్(Freedom at Midnight) సెకండ్ సిజన్
రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (Real Kashmir Football Club)
సమ్మర్ ఆఫ్ 76(Summar Of 76)
13
సివిల్ లైన్స్ (Civil Lines)
డైనాస్టీ (Dynasty)
సేతురాజన్ ఐపీఎస్ (Sethuraajan IPS)
షార్క్ ట్యాంక్ సీజన్ 5(Shark Tank Season 5) తదితర కొత్త వెబ్ సిరీస్‌లను సోనీ ప్రకటించింది.