మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. హైదరాబాద్‌కు సమీపంలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆచార్యలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
చిత్రంలో తనది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని చెప్పిన సోనూ ఐతే అది నెగిటివ్ రోలా? పాజిటివ్ రోలా అన్నది వెల్లడించలేదు. సినిమా షూటింగ్ లొకేషన్‌కు సోనూసూద్ తను ఉంటున్న హోటల్ నుంచి సైకిల్‌పై వెళ్లడం విశేషం. మాస్క్ ధరించి రోడ్లపై సోనూ వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బుధవారం ఉదయం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
#SonuSood Cycles His Way to #Acharya Shoot!! 👏👏#MegastarChiranjeevi #RamCharan #KoratalaSiva pic.twitter.com/C76JC5Ti04
— YouWe Media (@MediaYouwe) April 14, 2021