Sonu Sood Promises To Send Bullocks | మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అంబదాస్ పవార్ అనే 76 ఏళ్ల వృద్ధ రైతుకు అండగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. పొలం దున్నడానికి ఎద్దులు లేకపోవడంతో అంబదాస్ పవార్ స్వయంగా నాగలికి తనకు తానే కట్టుకుని దున్నుతుండగా, ఆయన భార్య నాగలిని వెనుక నుండి పట్టుకుని సహాయం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నేషనల్ మీడియాతో పాటు సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఫుల్ వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసి చలించిపోయిన సోనూ సూద్ వెంటనే స్పందించారు.
ఎద్దులు లేక నాగలి దున్నడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధ రైతుకు తాను అండగా నిలుస్తానని సోనూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు ఒక ఒక జత ఎద్దులను పంపించడానికి ఏర్పాట్లు చేస్తానని సోనూ సూద్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు. అయితే దీనిపై స్పందించిన నెటిజన్లు ఎద్దులు ఎందుకు ట్రాక్టర్ ఇస్తే బాగుంటుందని సలహా ఇవ్వగా.. సోనూ స్పందిస్తూ.. అంబదాస్ పవార్‌కి ట్రాక్టర్ నడపడం తెలియదు. కాబట్టి ఎద్దులు మంచివని సోనూ సూద్ బదులిచ్చారు. ఇదిలావుండగా, స్థానిక వ్యవసాయ అధికారులు కూడా ఈ దంపతులను సందర్శించి, వారికి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను, దాదాపు రూ. 1.25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
आप नंबर भेजिए।
हम बैल भेजतें हैं। https://t.co/EnaNTQqiZ1— sonu sood (@SonuSood) July 2, 2025