The Paradise | దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్ (THE PARADISE). ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే విడుదల చేసిన లుక్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు నాని.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ అధికారికంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి నాని తల్లిగా కనిపించనుంది.
రా స్టేట్మెంట్ గ్లింప్స్‌లో లో ఆమె వాయిస్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. సినిమాలో ఆమె నటన సెస్సేషన్ సృష్టించడం ఖాయం.. అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
పూణేకు చెందిన సోనాలి కులకర్ణి తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా ఇదే. మరాఠీ, హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్, ఇటాలియన్ భాషల్లో పలు సినిమాలు చేసింది సోనాలి కులకర్ణి. మరి శ్రీకాంత్ ఓదెల ఈ సీనియర్ నటిని సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. కిల్ యాక్టర్ రాఘవ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో కావడం, మరోవైపు నాని-అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా అవడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Team #TheParadise wishes the magnificent, National Award winning actor @sonalikulkarni Garu a very Happy Birthday ❤🔥
Her voice in the ‘Raw Statement : Glimpse’ took the internet by storm, her performance in the film will be a sensation ❤️🔥🐦⬛
In CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇,… pic.twitter.com/h8gVgMGDfq
— SLV Cinemas (@SLVCinemasOffl) November 3, 2025
NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!