‘లెజెండ్’ ‘పండగచేస్కో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ముంబయి సోయగం సోనాల్‌చౌహాన్. చక్కటి అందచందాలతో యువతను ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ ‘ఎఫ్-3’ చిత్రంలో నటిస్తున్నది. వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కీలకమైన పాత్రను పోషించనుంది. గ్లామర్ హంగులతో ఆమె పాత్ర అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సందర్భంగా గురువారం సినిమాలోని ఆమె స్టిల్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్యతారాగణంతో పాటు సోనాల్ చౌహాన్ కూడా పాల్గొంటున్నదని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సమర్పణ: దిల్‌రాజు, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, దర్శకత్వం: అనిల్ రావిపూడి.