శతృఘ్న సిన్హా నటవారసురాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పలు సనిమాల్లో నటించిన ఆమె నటిగా నిరూపించుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సోనాక్షి అప్పుడప్పుడు హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ హీటెక్కిస్తుంటుంది.
మనసులో ఏదీ దాచుకుండా నిర్మొహమాటంగా మాట్లాడటం సోనాక్షి నైజం. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన రిలేషన్ షిప్, లవ్ ఎఫైర్స్‌పై ఓపెన్ అయిన సోనాక్షి స్కూల్ ఏజ్ నాటి సీక్రెట్ మొదలుకొని యంగ్ ఏజ్ రిలేషన్ వరకు అన్నీ బయటపెట్టేసింది.
మీరెప్పుడైనా ఎవ్వరితోనైనా రిలేషన్ షిప్లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన సోనాక్షి.. స్కూల్లో ఉన్నప్పుడే ఒక అబ్బాయితో రిలేషన్ షిప్లో ఉన్నానని, అయితే అది కొద్ది రోజులకే ఎండ్ అయ్యిందని చెప్పింది. 21, 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్‌ను కొనసాగించానని తెలిపింది.ఒకే వ్యక్తితో అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్లో ఉన్నానని, వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయని చెప్పింది.
ప్రతి రిలేషన్ నుండి మనం కొత్త విషయాలను నేర్చుకుంటాం. ప్రేమించే వ్యక్తులను వెతుక్కుంటాం అని సోనాక్షి పేర్కొంది. 2010లో ‘దబాంగ్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి రీసెంట్గా ఆమె ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.