గత నెల 23న సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహబంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వైవాహిక జీవితం కొనసాగిస్తూనే తన తాజా సినిమా ప్రమోషన్లో ఇటీవలే పాల్గొన్నది సోనాక్షి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించీ, అలాగే తనపై వినిపిస్తున్న రూమర్ల గురించీ స్పందించింది సోనాక్షి. ‘పెళ్లికి ముందు ఎంత ఆనందంగా ఉండేదాన్నో.. ఇప్పుడు కూడా అంతే ఆనందంగా ఉన్నాను.
ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నాను. జీవితం ఇంతకంటే గొప్పగా , అందంగా ఉండదేమో. మళ్లీ నా కెరీర్ మొదలుపెట్టేశాను. అయితే పెళ్లి తర్వాత ఓ గట్టి నిర్ణయం మాత్రం తీసుకున్నాం. అదేంటంటే.. ఇకపై మేం హాస్పిటల్కు వెళ్లం. నా తండ్రి శత్రుఘ్నసిన్హా ఇటీవలే జ్వరం కారణంగా హాస్పటల్లో చేరారు. ఆయన్ను చూడటానికి మేం వెళ్లాం. అంతే.. నేను ప్రెగ్నంట్ అంటూ పిచ్చి రాతలు రాశారు. హాస్పిటల్కి వెళ్తే అందుకే వెళ్తామా? అదొక్కటే ఆలోచనగా ఎందుకు బతుకుతున్నారు?’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది సోనాక్షి.