2024 తన జీవితంలో మరిచిపోలేని సంవత్సరం అంటున్నారు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. తన జీవితంలో ఈ ఏడాది నింపిన మధురానుభూతుల్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె నెమరువేసుకున్నారు. ‘ఇంకొన్ని రోజుల్లో 2024కు గుడ్‌బై చెప్పబోతున్నామంటే కాస్త బాధగా ఉంది. ఎందుకంటే.. నా జీవితాన్ని ఆనందమయం చేసిన సంవత్సరం ఇది. నేను ఊహించని రెండు సర్ప్రైజులు ఈ ఏడాది నాకిచ్చింది. పెళ్లితో జీవితంలోని ముఖ్యమైన ఘట్టాన్ని మొదలుపెట్టాను.
అలాగే భన్సాలీ డైరెక్షన్లో నటించే అరుదైన అవకాశం ‘హీరామండీ’తో లభించింది. అది కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు ‘కాకుడా’ చిత్రంతో సోనాక్షి ఎలాంటి పాత్ర అయినా చేయగలదు అని నిరూపణ అయింది. అందుకే అటు వృత్తిపరంగా.. ఇటు వ్యక్తిగతంగా ఈ ఏడాది నాకు స్పెషల్. ఈ సంతోషంతోనే 2025లోకి అడుగుపెడుతున్నాను. వచ్చే ఏడాది నటిగా కొత్త సోనాక్షిని చూస్తారు.’ అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి సిన్హా.