Son of Sardaar 2 | అజయ్ దేవ్‌గణ్ కథానాయకుడిగా పదమూడేళ్ల కిత్రం వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్’ చిత్రం ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచింది. రాజమౌళి ‘మర్యాద రామన్న’కు రీమేక్ ఇది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ ఆఫ్ సర్దార్-2 ’ రాబోతుంది. తొలిభాగంలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటించగా సీక్వెల్లో ఆమె స్థానాన్ని మృణాల్ ఠాకూర్ భర్తీ చేస్తున్నది. సంజయ్‌దత్ మినహా సీక్వెల్లో అందరూ కొత్త తారలే కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొస్తున్నది.
జూలై 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయని, వాటికి తగ్గట్లుగా నాన్‌స్టాప్ కామెడీతో పాటు రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడు విజయ్ కుమార్ అరోరా తెలిపారు. గత కొంతకాలంగా బాలీవుడ్లో మంచి బ్రేక్కోసం ఎదురుచూస్తున్న మృణాల్ ఠాకూర్ సైతం ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. తొలిసారి అజయ్‌దేవ్‌గణ్ సరసన నటించడం మరచిపోలేని అనుభూతినిస్తున్నదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియో స్, అజయ్‌దేవ్‌గణ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్నాయి.